మరో నాలుగు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని సీఎం కేసీఆర్ తెలిపారు. సమ్మక్క బ్యారేజీ వద్ద 9 లక్షల క్యూసెక్కుల నీరు పోతుందని ఆయన అన్నారు. తెల్లారే సరికి ఎస్సారెస్పీ ప్రాజెక్ట్ నిండిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని.. 4 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తుందని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఎన్డీఆర్ఎఫ్ బలగాలు సిద్ధంగా ఉన్నాయని, విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన అన్నారు.…
అనంతపురం: టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని.. ముసలోడు అయినా చంద్రబాబే మేలు అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో ఎమ్మెల్యేలు పల్లెలన్నీ తిరుగుతున్నారని.. వాలంటీర్‌ను వెంటబెట్టుకుని వెళ్లి మరీ జగనన్నను దీవించాలని ప్రాధేయపడుతున్నారని జేసీ ప్రభాకర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. వైసీపీకి ఈరోజు కార్యకర్తలు లేరని.. అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదని జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యేల వెంట…