Jai Shankar: అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ జనవరి 20న ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి విదితమే. వాషింగ్టన్ డీసీలో ఆయన ప్రమాణస్వీకార కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగనుంది. డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రపంచంలోని పలు దేశాల నేతలు హాజరు కానున్నారు. అయితే, భారతదేశ తరఫున విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ పాల్గొననున్నారు. మినిస్టరీ అఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ప్రకటన ప్రకారం, డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ట్రంప్ – వాన్స్ కమిటీ ఆహ్వానం…