రాజకీయ వ్యూహాల్లో కెసీఆర్ దిట్ట. జాతీయ రాజకీయాల్లో ఒక శూన్యత ఉందని ఆయన గ్రహించారు. అందుకే జాతీయ పార్టీ పెట్టాలనుకున్నారు. దక్షిణాది నేతగా ఇలాంటి ఆలోచన రావటం సాహసమే. అయితే, చేతిక వచ్చిన అవకాశాన్ని అంటే..జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్రవేయటానికి ఒక లీడ్ తీసుకునే అవకాశాన్ని కెసీఆర్ చేజార్చుకున్నారు. రాజకీయంగా చాలా అడ్వాన్స్ గా ఆలోచించే కెసీఆర్ లెక్క ఎక్కడ తప్పింది? బిజెపికి, కాంగ్రెస్ కి సమదూరం పాటించాలనే కఠిన నియమానికి కట్టుబడి ఒక మంచి అవకాశాన్ని…
Centre provides round-the-clock Z+ category security cover by armed Central Reserve Police Force (CRPF) personnel to NDA presidential candidate Draupadi Murmu from today.
రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో ఎన్డీఏ కూటమి తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరు బరిలో నిలుస్తారని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ విషయంపై త్వరలోనే స్పష్టత రావొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. భాజపా పార్లమెంటరీ బోర్డు సమావేశం ఇవాళ జరగనుంది. ఈ సమావేశంలో రాష్ట్రపతి అభ్యర్థిపై ఉత్కంఠకు తెరదించే అవకాశం ఉంది. ఈ భేటీలో ప్రధాని మోదీ వర్చువల్‌గా పాల్గొననున్నట్లు సమాచారం. రాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసేందుకు భాజపా అధిష్ఠానం ఇప్పటికే కసరత్తు చేపట్టింది. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడితో…
రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల తరఫున అభ్యర్థిగా బరిలోనికి దిగేందుకు యశ్వంత్ సిన్హా సిద్ధమైనట్లు తెలుస్తోంది. బీజేపీ మాజీ నేత, కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా చేసిన ట్వీట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. విపక్షాల తరఫున అభ్యర్థి ఆయనేనా? అని చర్చ జరుగుతోంది. టీఎంసీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ట్విటర్ వేదికగా వెల్లడించారు. జాతీయ ప్రయోజనాల కోసం, విపక్షాల ఐక్యత కోసం పని చేయడానికి పార్టీ నుంచి బయటకు రావాల్సిన ఈ సమయం తప్పనిసరిగా భావిస్తున్నట్లు…
దేశవ్యాప్తంగా రాష్ట్రపతి ఎన్నికల సందడి నెలకొంది. విపక్షాలు ఉమ్మడి అభ్యర్థి కోసం అన్వేషణ సాగిస్తున్నాయి. ఎన్డీయే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించాలని టీడీపీ డిమాండ్ చేసింది. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ, యూపీఏ పక్షాలు అభ్యర్థి కోసం పాకులాడుతున్నాయి.. తపన పడుతన్నాయి. చేతిలో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడును ఉంచుకుని వేరే వారిని వెతుక్కోవడం దేనికి..? ఉప రాష్ట్రపతులు.. రాష్ట్రపతులు అయిన సంప్రదాయం మన దేశంలో…
మరోసారి రాష్ట్రపతి పదవికి అభ్యర్థి కోసం ప్రతిపక్షాల వేట ప్రారంభమైంది. ఢిల్లీలో ఇవాళ మరోసారి విపక్ష నేతలు సమావేశం కానున్నారు. ఉమ్మడి అభ్యర్థిని ఖరారు చేసేందుకు విపక్షాలు మరోసారి భేటీ కానున్నాయి. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నేతృత్వంలో 17 ప్రతిపక్ష పార్టీల నేతలు హాజరుకానున్నారు. ఇక మజ్లిస్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆదేశాల మేరకు మంగళవారం నాటి భేటీకి తాను హాజరవుతున్నట్లు ఆ పార్టీ ఎంపీ ఇంతియాజ్ జలీల్ వెల్లడించారు. ఉత్కంఠగా సాగుతుందునుకున్న రాష్ట్రపతి…
రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో అభ్యర్థి ఎంపికపై ఎన్డీఏ ముమ్మర కసరత్తు చేస్తోంది. రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల అయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు అధికార, ప్రతిపక్ష కూటముల నుంచి రాష్ట్రపతి అభ్యర్థి పేరు ఖరారు కాలేదు. విపక్షాలు ఇంకా తమ అభ్యర్థిని ఎన్నుకోనప్పటికీ మంగళవారం ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి పేరును మంగళవారం ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అధికార పక్షం తర్వాతే విపక్షాలు అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. భాజపా…
రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో దేశంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలన్న విపక్షాల ప్రయత్నాలు కొలిక్కి రాకుండానే బీజేపీ ఏకగ్రీవ రాగం ఎత్తుకుని పరిస్థితిని ఆసక్తికరంగా మార్చింది. రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో దాదాపుగా 49 శాతం ఓట్లున్న బీజేపీకి ఒకటీ అరా పార్టీల మద్దతుతో తన అభ్యర్థిని గెలిపించుకోవడం సునాయసమని భావిస్తున్నారు. కానీ ఆజాదీ కా అమృతోత్సవ్ నేపథ్యంలో రాష్ట్రపతిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని పార్టీ పిలుపునిచ్చింది. ఇందుకు విపక్షాలనూ ఒప్పించేందుకు రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, బీజేపీ చీఫ్…
ఇప్పుడు చర్చ మొత్తం రాష్ట్రపతి ఎన్నికలపైనే.. అధికార కూటమి అభ్యర్థి ఎవరు? అనే చర్చ ఓవైపు జరుగుతుంటే.. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి ఎవరు? అనే విషయాలపై విశ్లేషణలు జరుగుతున్నాయి. మరోవైపు రాష్ట్రపతి ఎన్నికలకు ముహూర్తం దగ్గర పడుతోంది. ఇప్పటికే నోటిఫికేషన్ కూడా విడుదల అయింది. ఈ నేపథ్యంలో పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఎన్నిక లేకుండా ఏకగ్రీవం ద్వారా తమ రాష్ట్రపతి అభ్యర్ధిని గెలిపించుకోవాలని అధికార పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఎన్డీయే ఎవరిని పెట్టినా కూడా…
రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ల ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభమైంది. ఈ ఎన్నికకు సంబంధించి ఎన్నికల కమిషన్(ఈసీ) నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ విడుదలైన బుధవారమే ఏకంగా 11 నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీ కాలం జులై 24న ముగుస్తుంది. ఈ లోగా కొత్త రాష్ట్రపతిని ఎన్నుకోవాల్సి ఉన్న నేపథ్యంలో రాష్ట్రపతి ఎన్నికకు బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఎన్నికల్లో ఓటు వేసే వారిలో 50…