కౌంటింగ్ కు సిద్ధం కావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బీజేపీ ఆధ్వర్యంలో ఈ రోజు(శుక్రవారం) వెబక్స్ వీడియో మాధ్యమం ద్వారా రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ.. ఎన్నికల అనంతరం కూటమికి అవకాశం ఉందని పలు విశ్లేషణలు తేటతెల్లం చేస్తున్నాయన్నారు.