2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ అధిష్టానం చర్యలు ప్రారంభించింది. కర్నాటక శాసనసభ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించిన తరువాత.. వివిధ రాష్ట్రాల్లో ఉన్న పార్టీ పరిస్థితిని సమీక్షించి పార్టీ పటిష్టతకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.