మణిపూర్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. గతేడాది అల్లర్లతో మణిపూర్ అట్టుడికింది. పదులకొద్ది ప్రాణాలు కోల్పోయారు. భారీగా ఆస్తి నష్టం కూడా జరిగింది. ఇక ఈ ఏడాది ఫిబ్రవరి 9న ముఖ్యమంత్రి పదవికి బిరెన్ సింగ్ రాజీనామా చేయడంతో ప్రభుత్వం పడిపోయింది.