అక్రమ మైనింగ్ కేసులో మనీలాండరింగ్ నిబంధనల కింద జార్ఖండ్, బీహార్‌లతో పాటు పలు రాష్ట్రాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు చేపట్టింది. ఈ దాడుల్లో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు అత్యంత సన్నిహితుడైన ప్రేమ్ ప్రకాశ్ ఇంట్లో రెండు ఏకే-47 రైఫిళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.