కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ‘బీస్ట్’ మూవీ ఈ నెల 13న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతోంది. నెల్సన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్. పాన్ ఇండియా మూవీగా రాబోతున్న ‘బీస్ట్’ను తొలిసారి భారతదేశంలో ప్రీమియం లార్జ్ ఫార్మాట్ (పీఎల్ఎఫ్) థియేటర్లలో ప్రదర్శించడానికి అన్ని ఏర్పాట్లూ జరుగుతున్నాయి. ఐమాక్స్ బిగ్ స్క్రీన్ తరహాలోనే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ‘ప్రీమియం లార్జ్ ఫార్మాట్’ ఆడిటోరియమ్స్ హవా సాగుతోంది. మరీ ముఖ్యంగా కరోనా అనంతరం ఇలాంటి పెద్ద…