ఇటీవల బీసీసీఐ విడుదల చేసిన సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్ భారత క్రికెట్‌లో పెను దుమారం రేపిన విషయం తెలిసిందే. రంజీల్లో ఆడకుండా బోర్డు ఆదేశాలను ధిక్కరించారనే ఆరోపణల నేపథ్యంలో స్టార్ ప్లేయర్స్ ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్‌లకు సెంట్రల్ కాంట్రాక్ట్ రద్దు చేసింది. రెడ్‌బాల్ క్రికెట్‌కు దూరంగా ఉంటూ.. రంజీల్లో ఆడకున్నా హార్దిక్ పాండ్యాకు కాంట్రాక్ట్ లిస్టులో చోటు ఇచ్చింది. దీనిపై మాజీ క్రికెటర్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా టీమిండియా మాజీ పేసర్ ప్రవీణ్ కుమార్…