Kota Srinivas Death : కోట శ్రీనివాసరావు మరణంపై సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కోట శ్రీనివాస్ మృతదేహానికి ఆర్.నారాయణ మూర్తి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నేను, కోట శ్రీనివాస్ ఒకేసారి కెరీర్ స్టార్ట్ చేశాం. ప్రాణం ఖరీదు సినిమాతో ఎంట్రీ ఇచ్చాం. ఆ తర్వాత కోట శ్రీనివాస్ వెనక్కి తిరిగి చూసుకోకుండా వందలాది సినిమాల్లో నటించారు. నటనలో ఆయనకు తిరుగు లేదు. నవరసాలు పండించిన నటుడు ఆయన.…