లక్నోలో ఆస్ట్రేలియా-ఎతో జరుగుతున్న రెండో అనధికార టెస్టులో టీమిండియా పేసర్ ప్రసిధ్ కృష్ణ తలకు గాయమైంది. ఇండియా-ఎ తరఫున బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అతడి హెల్మెట్‌కు బంతి బలంగా తగిలింది. ఇన్నింగ్స్ 39వ ఓవర్లో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ హెన్రీ థోర్న్టన్ వేసిన బంతి ప్రసిద్ధ్ హెల్మెట్‌ను తాకింది. ప్రోటోకాల్ ప్రకారం.. ఇండియా జట్టు వైద్య సిబ్బంది వెంటనే మైదానంలోకి వచ్చి కంకషన్ టెస్ట్ నిర్వహించాడు. ప్రసిధ్ తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. కంకషన్ టెస్ట్…