నిన్న హోరాహోరీగా జరిగిన ‘మా’ ఎన్నికల్లో అధ్యక్షుడిగా మంచు విష్ణు గెలవగా, ప్రకాష్ రాజ్ ఓడిపోయారు. ఈ సందర్భంగా ఆయన ప్రెస్ మీట్ పెట్టి తన పరాజయం గురించి మాట్లాడారు. “మా ఎన్నికలు బాగా జరిగాయి. చైతన్యంతో ఎక్కువ మంది ఓట్లు వేశారు. తెలుగు బిడ్డను ‘మా’ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. మా ఎన్నికల్లో గెలిచిన వాళ్లకు అభినందనలు. ప్రాంతీయ వాదం, జాతీయ వాదం మధ్య ఎన్నికలు జరిగాయి. నా తల్లిదండ్రులు తెలుగు వాళ్ళు కాదు. అది నా…