Pragya Singh Thakur: బీజేపీ మాజీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీశాయి. వివరాల్లోకి వెళితే, ఈ నెల ప్రారంభంలో భోపాల్‌లో జరిగిన ఒక ధార్మిక కార్యక్రమంలో ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. తల్లిదండ్రుల కోరికలకు వ్యతిరేకంగా తమ కుమార్తెలు ప్రవర్తిస్తే వారిని శారీరకంగా శిక్షించాలని సూచించారు.