ప్రభాస్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. డార్లింగ్ స్పీడ్ ను చూస్తుంటే ఆశ్చర్యం కలగక మానదు. ప్రస్తుతం మారుతీ దర్శకత్వంలో ‘ది రాజా సాబ్’ అనే సినిమాలో నటిస్తున్నాడు ప్రభాస్. హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి ఇటీవల రిలీజ్ చేసిన ప్రభాస్ ఘోస్ట్ లుక్ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అందుకుంది. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది, ఈ సినిమా తో పాటు ప్రేమకథలను తెరకెక్కించడంలో మాస్టర్ డిగ్రీ చేసిన హను…