రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘ది రాజా సాబ్’ టికెట్ రేట్లు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిజానికి శుక్రవారం నాడు ఈ సినిమా రిలీజ్ అవ్వనుంది. అయితే, గురువారం రాత్రి ప్రీమియర్స్ వేసేందుకు, శుక్రవారం నుంచి టికెట్ రేట్లు పెంచి అమ్ముకునేందుకు అనుమతి ఇవ్వాలని ఇప్పటికే ప్రభుత్వాన్ని నిర్మాతలు కోరారు. అయితే ప్రీమియర్స్ కి పర్మిషన్ ఇవ్వని ప్రభుత్వం, గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి…