Prabhala Theertham: అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ప్రసిద్ధ జగ్గన్నతోట ప్రభల తీర్థం నేడు అత్యంత వైభవంగా జరగనుంది. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఈ ప్రభల తీర్థానికి తాజాగా కూటమి ప్రభుత్వం రాష్ట్ర పండుగ హోదాను కల్పించడంతో ఉత్సవాలకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. సుమారు 450 ఏళ్లుగా కనుమ పండుగ రోజున కొనసాగుతున్న ఈ సంప్రదాయ ప్రభల జాతరను 11 గ్రామాల ప్రజలు అచంచల విశ్వాసంతో నిర్వహిస్తూ వస్తున్నారు.