రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ శీతాకాల విడిది కొరకు ఈ నెల 29 నుండి జనవరి 3 వతేది వరకు హైదరాబాద్ బొల్లారం రాష్ట్రపతి నిలయంలో విడిదికై రానున్నారు.గౌరవరాష్ట్రపతి రాకను పురస్కరించుకొని చేయవలసిన ఏర్పాట్ల గురించి వివిధ శాఖల అధిపతులతో బిఆర్ కెఆర్ భవన్ లో మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ చర్చించారు. గౌరవ రాష్ట్రపతి హైదరాబాద్ పర్యటనను తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టను, ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్ గుర్తింపును మరింత ఇనుమడింప చేసే అవకాశంగా…
దేశంలో గత కొన్ని రోజులుగా బొగ్గు సంక్షోభం కారణంగా విద్యుత్ ఉత్పత్తికి ఇబ్బందులు కలుగుతున్నాయి. మహారాష్ట్రలోని 13 బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు తాత్కాలికంగా మూతపడిన సంగతి తెలిసిందే. ధర్మల్ పవర్ స్టేషన్లలో బొగ్గు నిల్వలు నాలుగురోజులకు మించి లేవని, నాలుగురోజులు దాటితే విద్యుత్ ఉత్పత్తి ఆగిపోతుందని, ఈ సమస్యను పరిస్కరించకుండే విద్యుత్ సరఫరాకు అంతరాయం తప్పదని రాష్ట్రాలు కేంద్రాని విజ్ఞప్తి చేశాయి. ఇప్పటి వరకు అనేకమార్లు కేంద్రం దీనిపై సమీక్ష నిర్వహించింది. దేశంలో బొగ్గు…
భారత్‌లో త్వరలోనే విద్యుత్ సంక్షోభం రాబోతోంది.. దానికి ప్రధాన కారణం బొగ్గు కొరతే అనే వార్తలు గుప్పుమన్నాయి.. దానికి తగినట్టుగా కేంద్రం.. రాష్ట్రాలను అలర్ట్ చేయడం.. బొగ్గు కొరతపై ప్రకటన చేయడం.. విద్యుత్ సంక్షోభానికి దారితీసి నాలుగు పరిణామాలు ఇవేనంటూ ప్రకటించడం జరిగిపోయాయి.. అయితే, బొగ్గు కొరత ఉందంటూ వస్తులను వార్తలను కొట్టిపారేశారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. ఆ వార్తలు పూర్తిగా నిరాధారం అని క్లారిటీ ఇచ్చిన ఆమె.. భారత్ మిగులు విద్యుత్ గల…
బొగ్గు దెబ్బమీద దెబ్బ కొడుతున్నది. దక్షిణాదిన బొగ్గు సమస్యలు ఉన్నప్పటికీ ఉత్తరాదితో పోలిస్తే తక్కువే అనిచెప్పాలి. ఉత్తరాది రాష్ట్రాలు బొగ్గు సమస్యతో అట్టుడికిపోతున్నాయి. డిమాండ్ ఉన్న విద్యుత్ కంటె తక్కువ విద్యుత్ ఉత్పత్తి అవుతుండటంతో షార్టేజ్ వస్తున్నది. ఫలితంగా వినియోగదారులకు కోతలు విధిస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో కోతలు నాలుగు నుంచి ఐదు గంటల వరకు ఉంటోంది. ఇక బొగ్గు సంక్షోభంతో పంజాబ్ రాష్ట్రం తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటోంది. అక్టోబర్ 11 వ తేదీన పంజాబ్ రాష్ట్రంలో ఏకంగా…
దేశంలో బొగ్గు కొరత కారణంగా రాష్ట్రాలు విద్యుత్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఈ సమస్యపై కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకున్నది. రాష్ట్రాలకు పలు కీలకమైన సూచనలు చేసింది. కేంద్రం వద్ద ఉన్న కేటాయించని విద్యుత్‌ను వాడుకోవాలని రాష్ట్రాలకు సూచించింది. కొన్ని రాష్ట్రాలు అధిక ధరలకు విద్యుత్ ను విక్రయిస్తున్నాయని, వినియోగదారులకు ఇవ్వకుండా విద్యుత్‌ను అమ్ముకోవద్దని కేంద్రం సూచించింది. ఎక్కువ ధరల కోసం విద్యుత్‌ను అమ్ముకునే రాష్ట్రాలపై చర్యలు తీసుకుంటామని కేంద్రం హెచ్చరించింది. కేటాయించని విద్యుత్‌ను వాడుకునే వెసులుబాటును తొలగిస్తామని…
చైనా పెద్ద సంక్షోభంలో పడిపోయింది… తీవ్రమైన కరెంట్ కోతలతో అల్లాడిపోతోంది.. అయితే, ఇప్పుడు భారత్‌కు కూడా విద్యుత్ ఉత్పత్తి, కరెంట్ కోతల ముప్పు పొంచిఉందనే హెచ్చరికలు కలవరపెడుతున్నాయి.. బొగ్గు నిల్వలు నిండుకోవడంతో ఈ పరిస్థితి దాపురిస్తోందని భయాలు వెంటాడుతున్నాయి.. మరి, తెలంగాణలో పరిస్థితి ఏంటి..? అనే చర్చ మొదలైంది. దీనిపై విద్యుత్ శాఖ అధికారులు క్లారిటీ ఇచ్చారు.. దేశంలోనే సేఫ్ విద్యుత్ ఉత్పత్తి, సరఫరా చేస్తున్న రాష్ట్రం తెలంగాణగా వెల్లడించారు. సీఎం కేసీఆర్, సీఎండీ ప్రభాకర్ రావు…
ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ ను తాలిబన్లు కైవసం చేసుకోవడంతో అక్కడ అంతర్యుద్ధం జరుగుతున్నది. పరిస్థితులు దారుణంగా మారిపోయాయి. ఆ దేశాధ్యక్షుడు దేశం వదిలి పారిపోయాడు. ఇక ఇదిలా ఉంటే, ఆఫ్రికాలోని గినియాలోనూ సైనికుల తిరుగుబాటు జరిగింది. దేశాన్ని సైనికులు వారి చేతిల్లోకి తీసుకున్నారు. గినియా అధ్యక్షుడు అల్ఫా కోంటేని సైనికులు అదుపులోకి తీసుకున్నారు. రాజ్యాంగాన్ని రద్దు చేసినట్టు సైనికులు ప్రకటించారు. దేశంలో ప్రజారంజకమైన పాలన సాగిస్తామని ఆ దేశ ఆర్మీ కల్నల్ మామాడి డౌంబౌయా తెలిపారు. ఈరోజు…