Hombale Films: హోంబలే ఫిల్మ్స్.. ప్రస్తుతం పాన్ ఇండియాను షేక్ చేస్తున్న నిర్మాణ సంస్థ. కెజిఎఫ్ 1, కెజిఎఫ్ 2, సలార్.. ఇలా పాన్ ఇండియా సినిమాలన్నీ నిర్మించి.. ప్రపంచ వ్యాప్తంగా తమ పేరును వినిపించేలా చేస్తోంది. అయితే అసలు హోంబలే కు ఆ పేరు ఎలా వచ్చింది. దీని వెనుక ఎవరు ఉన్నారు.. ఆ కథాకమామీషు ఏంటి అనేది అభిమానులు తెలుసుకోవాలని ఆసక్తి కనపరుస్తున్నారు.