టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, అక్కినేని నాగార్జున తనయుడు నాగచైతన్య కొన్ని నెలల కిందట విడిపోయిన సంగతి తెలిసిందే. తామిద్దరం విడిపోతున్నట్లు సోషల్ మీడియాలో గతేడాది ప్రకటించి సమంత, నాగచైతన్య ఫ్యాన్స్‌ను షాక్‌కు గురిచేశారు. తమ దారులు వేరని, ఇకమీదట తాము దంపతులుగా జీవించబోమని వెల్లడిస్తూ అభిమానులకు షాకిచ్చారు. ఈ విషయం సినీ అభిమానులందరికీ దిగ్భ్రాంతికి గురి చేసింది. అయితే ఇప్పుడిప్పుడే నాగచైతన్య, సమంత ఇద్దరూ విడాకుల విషయాన్ని మరిచిపోయి కెరీర్ మీద దృష్టి పెట్టారని అందరూ…