Caste Census Survey: కేంద్ర మంత్రివర్గ సమావేశంలో కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రెండు దశల్లో దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది అక్టోబర్ 1వ తేదీ నుంచి తొలి దశ కుల గణన చేపట్టడానికి ప్లాన్ చేస్తుండగా.. 2027 మార్చి 1వ తేదీ నుంచి రెండో దశ కుల గణన చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.
2021లో జరగాల్సిన జనగణన కరోనా నేపథ్యంలో నిలిచిపోయింది. ఇప్పటికే జనాభాలో భారత్ చైనాను వెనక్కి నెట్టి మొదటి స్థానంలో నిలిచింది. కాకపోతే ఇందుకు సంబంధించిన అధికారిక లెక్కలు మాత్రం ఇప్పటి వరకు విడుదల కాలేదు. ఇదే సమయంలో బ్లూమ్ బర్గ్ వర్గాలు జనగణన పై కొన్ని కీలక విషయాలను ప్రకటించాయి. అతిత్వరలో జరగబోనున్న లోక్‌సభ ఎన్నికల తర్వాతనే జనగణన ఉంటుందని ప్రకటించింది. ఇందుకు సంబంధించిన ఆర్థిక డేటా నాణ్యతను అప్ గ్రేడ్ చేసే మార్గాలను చర్చిస్తోందని వెల్లడించింది.…