Cabinet decisions: కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. రాబోయే జనాభా లెక్కల్లో కులగణన చేస్తామని ప్రకటించింది. బుధవారం కేంద్రం క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలను కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. జనాభా లెక్కలతో పాటు కుల గణనను చేర్చాలని రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ నిర్ణయించినట్లు వెల్లడించారు.
భారత ప్రభుత్వం జనాభా గణనను నిర్వహించడానికి పూర్తి సన్నాహాలు చేసింది. వచ్చే ఏడాది నుంచి జనాభా గణన ప్రారంభించి ఏడాదిలోగా ఈ ప్రక్రియ పూర్తవుతుంది. ఈ జనాభా గణన డేటా 2026లో మాత్రమే పబ్లిక్ చేయబడుతుంది. ఈ జనాభా గణన 2021లోనే ప్రారంభం కావాల్సి ఉండగా, కరోనా కారణంగా వాయిదా పడింది.
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి భారత ప్రభుత్వం జనాభా గణనలో షెడ్యూల్డ్ కులం (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ) మినహా కులాల వారీగా జనాభాను లెక్కించలేదని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇవాళ తెలిపింది.