ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు సౌకర్య పథకాన్ని ఆర్టీసీ విజయవంతంగా అమలు చేయడానికి నిధులు ఇస్తామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఆర్టీసీ ప్రయాణికులపై రవాణా చార్జీల భారం మోపకుండా సంస్థను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపైన దృష్టి పెట్టి.. నిర్వహణ సామర్థ్యాన్ని పెంచుకోవాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్ లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో బుధవారం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ)పై రవాణా, బీసీ…
ప్రజా పాలన దరఖాస్తులు జనవరి 6నే చివరి రోజు అని మళ్ళీ గడువు పొడిగింపు ఉండదని స్పష్టం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇవాళ ఆయన సెక్రటేరియట్ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. కాళేశ్వరంలో అవినీతి జరుగుతుందని ఢిల్లీ నుంచి గల్లీ వరకు తెలుసు అని అన్నారు. కేసీఆర్ స్క్రిప్ట్ ను బీజేపీ నేతలు చదివారని, కాళేశ్వరం పై సిట్టింగ్ జడ్జీతో న్యాయ విచారణకు ఇప్పటికే ఆదేశించామన్నారు. కేసీఆర్ ను రక్షించేందుకే సిబిఐ విచారణ బీజేపీ అడుగుతుందన్నారు.…
కరీంనగర్ లోయర్ మానేరు డ్యాం నుండి దిగువ అయకట్టు పరిధిలోని పంటలకి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. 2023 స్పూర్తికి నాంధి పలికిందన్నారు. యాసంగి పంటకి నీరు అందించడానికి మానేరు నుండి నీటిని విడుదల చేసినామన్నారు. వరి మీద అధారపడకుండా ఆరు తడి పంటలు వేయాలని రైతులకి విజ్ఞప్తి చేశారు. అరుతడి పంటలు వేసి,ప్రభుత్వం నుండి ప్రోత్సాహం…
Ponnam Prabhakar: ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) నిరంతరం కృషి చేస్తోంది. రవాణా రంగంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ వినూత్న పద్దతుల ద్వారా ప్రయాణికులకు చేరువ అవుతోంది.
Ponnam Prabhakar: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ప్రజా పాలనపై నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ కార్యకర్తలకు రవాణా, బీసీ సంక్షేమశాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ దిశానిర్దేశం చేశారు.
బీఆర్ఎస్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. గాంధీభవన్ లో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం మారింది.. దానికి అగుగుణంగా వ్యవహరించాలని కోరారు. ప్రజలు మార్పు కోరుకున్నారని ఆయన అన్నారు. బీఆర్ఎస్ చేసింది బంగారు తెలంగాణ అయితే.. ప్రజావాణి నుండి వేల పిటిషన్లు ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు. కాగా.. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో ఆటో డ్రైవర్లు, యూనియన్లు నిరసన చేస్తున్నారు.. వారికి అండగా ఉంటాం.. వారి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. 15 రోజుల్లో రివ్యూ చేస్తామని…
రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖా మాత్యులుగా పొన్నం ప్రభాకర్ సోమవారం సచివాలయంలో బాధ్యతలు చేపట్టారు. మొదటగా మంత్రి తన ఛాంబర్ లో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వేద పండితులు మంత్రి పొన్నంకు ఆశీర్వచనాలు అందించారు. మంత్రి పొన్నం.. మొదటగా ఆర్టీసీ ఫైల్ పై రూ. 375 కోట్ల నిధులు విడుదల చేస్తూ మొదటి సంతకం చేశారు. మంత్రితో రవాణా శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ వాణీ ప్రసాద్ సంతకం చేయించారు. ఆర్టీసీకి మూడవ త్రైమాసిక బడ్జెట్ కింద…
TS Assembly: నాల్గవ రోజు తెలంగాణ అసెంబ్లీ సెషన్లు ప్రారంభమయ్యాయి. ఈ చట్టాన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రారంభించారు. గవర్నర్ ప్రసంగం ఒక తీర్మానాన్ని చేపట్టారు.
Ponnam Prabhaker: కేటీఆర్ కు పాలనానుభవం లేక అవాకులు పేలుతున్నాడని రవాణా, బీసీ సంక్షేమశాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. ప్రభుత్వం ఏర్పడి కనీసం వారం గడవకముందే పథకాలు అమలవ్వడం లేదని కేటీఆర్ మాట్లాడం సరికాదన్నారు.