పాదయాత్ర చేస్తే.. అధికారం ఖాయమా? ఎన్నికలకు ముందు జనాన్ని నేరుగా కలిస్తే.. గెలుపు తనంతట తానే మన దగ్గరకు వస్తుందా? గతంలోని ఉదాహరణలు చూపించి.. అది నిజమే అని చాలా మంది అంటుంటారు. అందుకు 2003లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన పాదయాత్ర నాంది పలికిందనే చెప్పవచ్చు. ఆనాడు కాంగ్రెస్ ను ఎలాగైనా అధికారంలోకి తీసుకురావాలన్న సంకల్పంతో.. ఆయన చేసిన పాదయాత్ర.. సంచలనాన్ని సృష్టించింది. కాంగ్రెస్ ను పూర్తి స్థాయి మెజారిటీతో…