Addanki Dayakar: టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ వివిధ అంశాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత రాజ్యాంగ పరిరక్షణను కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక బాధ్యతగా తీసుకుంటుందని, ఈ విషయంలో రాహుల్ గాంధీకి దేశ ప్రజల మద్దతు మరింత పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్బంగా ఆయన బీజేపీ వైఖరిపై ఘాటు విమర్శలు చేశారు. 2029లో దేశంలో పూర్తిస్థాయి అధికారంలోకి రావడానికి బీజేపీ నార్త్, సౌత్‌లో రాజకీయ కుట్రలు పన్నుతోందని దయాకర్ ఆరోపించారు. జెమిలి ఎన్నికలతో ప్రయోగాలు…
తెలంగాణలో భవిష్యత్ రాజకీయ ప్రయోజనాల కోసం ఇప్పటి నుంచే కాంగ్రెస్ అడుగులు వేస్తోందా? లెఫ్ట్‌తో చెట్టపట్టాల్ చెబుతున్నదేంటి? ఉద్యమాలకే పరిమితమా.. లేక ఎన్నికల్లోనూ దోస్తీ కొనసాగుతుందా? ఎన్నికల వరకు కలిసి వెళ్తారా? తెలంగాణలో కొత్త రాజకీయ కూటమి ఏర్పాటు కాబోతుందా? ఉద్యమాల్లో కలిసి పనిచేసే కామ్రేడ్‌లే.. ఐక్యంగా ఎన్నికల్లో పోటీ చేయలేక పోతున్నారు. అలాంటి వామపక్షాలతో కలిసి కాంగ్రెస్ ఎన్నికలకు వెళ్తుందా? కేవలం ఉద్యమాల వరకే కలిసి సాగుతుందా? పొలిటికల్ సర్కిళ్లలో జరుగుతున్న తాజా చర్చ ఇదే.…