నల్లగొండ జిల్లా కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్తుపై వస్తున్న ప్రచారంపై స్పందించారు. తన పదవికి రాజీనామా చేస్తున్నానని, పార్టీ మారుతున్నానని లేదా కొత్త పార్టీ పెడుతున్నానని జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదని ఆయన స్పష్టం చేశారు.