ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ పై టీడీపీ అధిష్టానం సీరియస్ గా ఉంది. పార్టీ టికెట్ ఇవ్వడంతో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన కొలికపూడి.. తన చర్యలతో పార్టీనే ఇరకాటంలోకి నెడుతున్నారు. గతంలో సీఎం చంద్రబాబు కొలికపూడికి వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.. దీంతో రేపు మరోసారి క్రమశిక్షణా కమిటీ ముందు హాజరుకావాలని టీడీపీ అధిష్టానం ఆదేశించింది.