కానిస్టేబుల్స్ కుటుంబాలు రోడ్డు మీదకు రావటానికి సీఎం రేవంత్ కారణమని ఆరోపించారు మాజీమంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. ఇవాళ తెలంగాణ భవన్ లో సబితా ఇంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. హోంశాఖ నిర్వహిస్తోన్న రేవంత్ ఫెయిల్ అవ్వటం వలనే పోలీస్ కుటుంబాలు బయటకు వచ్చాయని, రక్షకభటులే న్యాయం కావాలని రోడ్డు ఎక్కటం బాధాకరమన్నారు.
స్పెషల్ పోలీసుల ఆందోళనలపై తెలంగాణ డీజీపీ జితేందర్ రెడ్డి స్పందించారు. పోలీస్ బెటాలియన్స్‌లో ఆందోళన చేసినవారిపై చర్యలకు రంగం సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు. సెలవులపై పాత పద్ధతిని అమలు చేస్తామని చెప్పినప్పటికీ.. మళ్లీ ఆందోళనలకు దిగడంపై పోలీస్‌శాఖ సీరియస్ అయ్యింది. పోలీస్ శాఖలో క్రమశిక్షణ ఉల్లంఘన సహించమని డీజీపీ తెలిపారు.