పోలీస్ ఉద్యోగాలే టార్గెట్ గా కష్టపడుతున్న వారికి, తమకు వయో పరిమితి దాటిందని బాధపడుతున్ననిరుద్యోగులకు శుభవార్త చెప్పింది తెలంగాణ సర్కార్. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పోలీస్ రిక్రూట్మెంట్ కు సంబంధించిన నోటిఫికేషన్ రావడంతో నిరుద్యోగుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. ఇటీవల తెలంగాణ సర్కార్ 17,291 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందుకు తగ్గట్లుగానే లక్షల్లో దరఖాస్తులు వస్తున్నాయి. ఇప్పటి వరకు దాదాపుగా 10 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇదిలా ఉంటే కోవిడ్ వల్ల, నోటిఫికేషన్ ఆలస్యం…