ఏపీ డీజీపీకి రాజేంద్రనాథ్ రెడ్డికి జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీచేసింది. చిత్తూరు జిల్లా జైలు సూపరింటెండెంట్ ఇంట్లో పని చేస్తోన్న దళిత మహిళను వేధిస్తోన్న ఘటనలో డీజీపీకి NHRC నోటీసులు ఇచ్చింది. దళిత మహిళపై దొంగతనం బనాయించి అక్రమంగా కేసు పెట్టారంటూ NHRCకి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. నేరం ఒప్పుకోవాలంటూ దళిత మహిళ ఉమా మహేశ్వరిని కస్టోడియల్ టార్చర్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు వర్ల…
ప్రజలను కాపాడాల్సిన పోలీసులే.. ప్రజలను బాధిస్తున్నారు. అన్యాయం జరిగిందని చెప్పుకోవడానికి పోలీస్ స్టేషన్ కి వస్తే.. లంచం ఇస్తావా.. మంచం ఎక్కుతావా అంటూ దిగజారి మాట్లాడుతూ పోలీస్ వ్యవస్థ పరువు తీస్తున్నారు. తాజాగా ఒక మహిళ ఒక పోలీస్ తనను లైంగికంగా వేధించాడంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం స్థానికంగా సంచలనం రేపుతోంది. ఈ ఘటన బెంగుళూరులో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. బెంగుళూరులోని ఐటీ హబ్ లో నివాసముండే ఒక మహిళ తనకున్న రెండు ఇళ్లలో ఒకదాన్ని అద్దెకు…
నెల్లూరు నగరంలో రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. వైసీపీ నేతల మద్దతుతో తమపై పోలీసుల వేధింపులు ఎక్కువైపోయాయి అని మాజీ కార్పొరేటర్ కప్పిర శ్రీనివాసులు ఆరోపించారు. నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు టీడీపీ నేతలు పేర్కొన్నారు. పోలీసులు గత వారం రోజులుగా వేధింపులకు గురిచేస్తున్నారని దీనికి నిరసనగా ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించినట్టు టీడీపీ నేతలు తెలిపారు. దీంతో కత్తి శ్రీనివాసులును హుటాహుటిన నెల్లూరు రామచంద్రారెడ్డి హాస్పిటల్ కి తరలించారు. అక్కడ వైద్యులు ఆయనకు వైద్యం అందించే ప్రయత్నం చేశారు. మెరుగైన…