కోనసీమ జిల్లా పేరు మార్పు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. కోనసీమ పేరు మార్పును నిరసిస్తూ రెండురోజుల క్రితం అమలాపురంలో పెద్ద ఎత్తున జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. చివరకు మంత్రి, ఎమ్మెల్యే నివాసాలకు కూడా ఆందోళనకారులు నిప్పుపెట్టారు. ఈ నేపథ్యంలో ఆందోళనకారులను అరెస్ట్ చేసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా అమలాపురం కలెక్టరేట్ వద్ద ఆందోళన చేసిన 46 మందిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. Minister Botsa: వాళ్లు అధికారంలో ఉంటే అతివృష్టి…