మంత్రి మల్లారెడ్డిపై దాడి ఘటన తెలంగాణలో సంచలనంగా మారింది. ఇది పూర్తిగా పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఆదివారం రెడ్డి ఘర్జణ సమావేశంలో మంత్రి మల్లారెడ్డిని అడ్డుకోవడంతో పాటు ఆయన కాన్వాయ్ ను అడ్డుకుని దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనపై తాజాగా టీఆర్ఎస్ నేతలు ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నిన్న రాచకొండ కమిషనరేట్ పరిధిలో కేసు నమోదు అయింది. తాజాగా ఈ రోజు మల్లారెడ్డిపై దాడి ఘటనలో మరో కేసు నమోదు చేశారు.…