YCP Ex-MLA Arrest: పల్నాడు జిల్లా నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై కేసు నమోదైంది. రెండు రోజుల క్రితం నరసరావుపేటలో అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారని కేసు నమోదు చేశారు పోలీసులు. పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉండగా అనుచరులతో కలిసి గోపిరెడ్డి ర్యాలీలో పాల్గొన్నారు. గోపిరెడ్డితో పాటూ మరో 22 మంది అనుచరులపై నరసరావుపేట వన్ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
Municipal Chairperson: హిందూపురం మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక సందర్భంగా హిందూపురం పట్టణంలో 144 సెక్షన్, సెక్షన్ 30 పోలీస్ ఆక్ట్ అమలులో ఉన్నట్లు హిందూపురం పోలీసులు ప్రకటించారు. ఎన్నికల సందర్భంగా శాంతి భద్రతలు పరిరక్షించేందుకు ఈ కఠిన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. మున్సిపల్ కౌన్సిల్ హాలులో మున్సిపల్ కమిషనర్ అనుమతించిన వ్యక్తులు మాత్రమే ప్రవేశించేందుకు అనుమతి ఉంది. మిగతా వారెవరూ హాల్‌లోకి వెళ్లరాదు. పట్టణంలో 144 సెక్షన్ అమల్లో ఉండటంతో ప్రజలు గుంపులుగా కూడకూడదని పోలీసులు హెచ్చరించారు.…