రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా ఏపీకి కేటాయించిన ఎయిమ్స్ ప్రారంభానికి సిద్ధమైంది. ఈ ఆధునిక వైద్య దేవాలయాన్ని రేపు ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. మంగళగిరి ఎయిమ్స్‌ను ప్రధాని మోడీ జాతికి అంకితం చేయనున్నారు. అలాగే 9 క్రిటికల్ కేర్ యూనిట్లకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు.
పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నివాళులర్పించారు. పుల్వామాలో అమరులైన వీరులకు నివాళులు అర్పిస్తున్నాను అని సోషల్ మీడియా ప్లాట్‌ఫారం ట్విట్టర్ (ఎక్స్)లో ప్రధాని మోడీ తెలిపారు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో తొలి హిందూ దేవాలయం నిర్మితమైంది. బుధవారం ఈ ఆలయం ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే రెండ్రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోడీ (PM Modi) మంగళవారం యూఏఈకి వెళ్తున్నారు.
OBC Row: రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. పీఎం మోడీ వెనకబడిన వర్గాల్లో(ఓబీసీ)లో పట్టలేదని గురువారం రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఒడిశాలో జరుగుతున్న ‘భారత్ జోడో న్యాయ యాత్ర’లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ప్రధాని తనను తాను ఓబీసీగా చెప్పుకుంటూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. గుజరాత్‌లో బీజేపీ ప్రభుత్వ హయాంలో ఓబీసీల్లో చేర్చిన ‘ఘంచీ’ కులానికి చెందిన కుటుంబంలో ఆయన ప్రధాని మోడీ జన్మించారని అన్నారు.
CM Nitish Kumar: బీహార్ ముఖ్యమంత్రి ఈ రోజు ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అయ్యారు. ఇండియా కూటమి, ఆర్జేడీతో పొత్తుని తెంచుకుని ఇటీవల ఆయన మళ్లీ బీజేపీతో జతకట్టి ఎన్డీయే కూటమిలో చేరిన సంగతి తెలిసిందే. 9వ సారి ముఖ్యమంత్రిగా బీజేపీ-జేడీయూ ప్రభుత్వాన్ని బీహార్‌లో ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే, ఎన్డీయేలోకి తిరిగి చేరిన తర్వాత తొలిసారిగా ఆయన ఢిల్లీకి వచ్చారు. ప్రధాని మోడీతో భేటీ అయ్యారు.
ప్రధాని నరేంద్ర మోడీ వెనుకబడిన వర్గానికి (OBC) చెందిన వ్యక్తి.. ఆయన చేతుల మీదుగా అయోధ్యలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగడం వల్లే శంకరాచార్యులు రాలేదని తమిళనాడు క్రీడా అభివృద్ధి శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఆరోపించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఢిల్లీలోని భారత్ మండపంలో విద్యార్థులతో పరీక్షల(పరీక్షా పే చర్చ 2024) గురించి చర్చించారు. పరీక్షల టెన్షన్‌ను తొలగించేందుకు విద్యార్థులతో ప్రధానమంత్రి ముచ్చటించారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సంభాషించారు. ప్రధాన మంత్రి అనేక ఉదాహరణలు ఇవ్వడం ద్వారా పిల్లలను ప్రేరేపించారు. ఎలాంటి ఒత్తిడినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పారు.
సుప్రీంకోర్టు డైమండ్ జూబ్లీ వేడుకలను ప్రధాని మోడీ ప్రారంభించారు. దేశ సర్వోన్నత న్యాయస్థానం 75వ వసంతంలోకి అడుగు పెట్టింది. 1950 జనవరి 28న సుప్రీంకోర్టు ప్రారంభమైంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ న్యాయస్థాన వజ్రోత్సవాలను ప్రారంభించారు.
PM Modi : ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం తన రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ ద్వారా ఈ ఏడాది తొలిసారిగా దేశప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండు రోజుల క్రితం మనమందరం 75వ రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా జరుపుకున్నాం. ఈ ఏడాది మన రాజ్యాంగం 75 ఏళ్లు పూర్తి చేసుకుంది.
దేశ సర్వోన్నత న్యాయస్థానం 75వ వసంతంలోకి అడుగు పెట్టింది. 1950 జనవరి 28న సుప్రీంకోర్టు ప్రారంభమైంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ న్యాయస్థాన వజ్రోత్సవాలను ప్రారంభించనున్నారు