Vande Mataram: భారతదేశ చరిత్రలో అత్యంత ముఖ్యమైన వాటిలో ఒకటైన “వందేమాతరం” జాతీయ గేయం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నేడు “వందేమాతరం” జాతీయ గేయం 150వ వార్షికోత్సవం ప్రారంభమవుతోంది. దేశవ్యాప్తంగా ఏడాది పొడవునా జరిగే ఈ సంస్మరణోత్సవాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడి ఢిల్లీలో లాంఛనంగా ప్రారంభించనున్నారు. నేడు 9.30 గంటలకు ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ప్రధానమంత్రి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా చరిత్రకు గుర్తుగా స్మారక తపాలా బిళ్ళ, స్మారక నాణెంను కూడా ఆయన…