ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ప్రయాగ్ రాజ్ చేరుకున్న ఆయన త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరించారు. అనంతరం గంగా మాతకు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దేశ శ్రేయస్సు కోసం మోడీ ప్రార్ధించారు. మోడీ వెంట యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వచ్చారు. ప్రధాని మోదీ మరియు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఏరియల్ ఘాట్ నుంచి మహాకుంభ్ వరకు పడవ ప్రయాణం చేశారు. ప్రధాని పర్యటన వేళ భద్రతా సిబ్బంది…