తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫోన్ చేశారు ప్రధాని నరేంద్ర మోడీ.. నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలోని ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో ప్రమాదం జరిగిన విషయం విదితమే కాగా.. ఆ ప్రమాదంపై ఆరా తీశారు ప్రధాని.. ఇక, జరిగిన ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను ప్రధాని మోడీకి ఫోన్‌లో వివరించారు సీఎం రేవంత్ రెడ్డి.. ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో ఎనిమిది మంది కార్మికులు చిక్కుకున్నారని, వారిని కాపాడేందుకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టామని ప్రధాని తెలిపారు తెలంగాణ సీఎం..