అహ్మదాబాద్ విమాన ప్రమాద దృశ్యాలు.. ఇంకా కళ్లముందు కనిపిస్తూనే ఉన్నాయి. ఇంకా మృతదేహాల అప్పగింత కూడా పూర్తికాలేదు. ఈలోపే మళ్లీ మళ్లీ విమానాల్లో లోపాలు బయటపడుతున్నాయి. ప్రయాణికుల ప్రాణాలు.. గాల్లో దీపాలుగా మారుతున్నాయి. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అన్న భయం.. విమానం ఎక్కే వారిలో కనిపిస్తోంది. అసలు ఎందుకు ఇలా జరుగుతోంది ? లోపాలు ఎక్కడ ఉన్నాయి ? విమానాల్లో సాంకేతిక సమస్యాలా లేక నిర్వహణలో రూల్స్ పాటించకపోవడమా ?