ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణ ఇవాళ్టితో ముగియనుంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో రెండు వారాల పాటు ప్రభాకర్ రావును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) బృందం విచారిస్తోంది. డిసెంబర్ 26వ తేదీన ప్రభాకర్ రావును విడిచి పెట్టాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రెండో వారం విచారణలో ప్రభాకర్ రావు నుంచి సిట్ బృందం కీలక సమాచారం రాబట్టింది. మొదట విచారణకు సహకరించని ప్రభాకర్ రావు.. పూర్తి ఆధారాలు ముందు ఉంచడంతో…