13 Killed, 23 Missing In Philippines Floods: ఆగ్నేయాసియా దేశం ఫిలిప్పీన్స్ భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అవుతోంది. ఎప్పుడూ లేని విధంగా వరదలు రావడంతో ప్రజలు తీవ్రంగా ప్రభావితం అవుతున్నారు. ఇప్పటికే చాలా మంది వర్షాలు, వరదల కారణంగా మరణించారు. పలువురు గల్లంతు అయ్యారు. చాలా మంది నిరాశ్రయులు అయ్యారు. క్రిస్మస్ రోజు కురిసిన భారీ వర్షాల వల్ల దేశంలో ఇప్పటి వరకు 13 మంది మరణించారు. మరో 23 మంది మత్స్యకారులు తప్పిపోయారు.