ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారిపై విజయం సాధించడానికి ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్… కోవిడ్‌పై పోరాటంలో భాగంగా భారత్‌లో ఇప్పటికే 18 ఏళ్లకు పైబడినవారికి వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగుతోంది.. దాదాపు 43 కోట్ల మందికి టీకా వేశారు. ఇక, 18 ఏళ్లు లోపు వారికి వ్యాక్సిన్ వచ్చేది ఎప్పుడూ..? అని అంతా ఎదురుచూస్తున్నారు.. ఈ నేపథ్యంలో.. కీలక ప్రకటన చేశారు ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా.. పిల్లల కోసం భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్…
అతి త్వరలోనే భారత్‌లోకి ఫైజర్ టీకా రానుంది. ఈ మేరకు ఆ సంస్థ సీఈఓ ఆల్బర్ట్ బౌర్లా కీలక ప్రకటన చేశారు. అత్యవసర వినియోగం కింద మరికొన్ని రోజుల్లోనే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందన్నారు ఆల్బర్ట్ బౌర్లా. ఇందుకు సంబంధించిన అనుమతుల ప్రక్రియ తుదిదశకు చేరుకుందని చెప్పారు. భారత్‌లో ఇప్పటికే మూడు వ్యాక్సిన్‌లు వినియోగంలో ఉన్నప్పటికీ వ్యాక్సిన్‌ల కొరత వేధిస్తోంది. దీంతో విదేశీ టీకాలకు అనుమతి ఇవ్వడం వల్ల ఈ సమస్యను అధిగమించవచ్చని కేంద్రం భావిస్తోంది. read also…
భారత్‌ను సెకండ్ వేవ్ కుదిపేసింది.. ఇప్పుడు థర్డ్ వేవ్ ముప్పు కూడా పొంచిఉందని.. అది పిల్లలపైనే ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉందనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి.. ఇప్పుడు కొన్ని దేశాలు పిల్లలకు కూడా వ్యాక్సిన్ ఇచ్చే పనిలో పడ్డాయి… బ్రిటన్‌కు చెందిన మెడిసిన్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రోడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ.. తాజాగా, 12 నుంచి 15 ఏళ్ల వయసు పిల్లలకు ఫైజర్ వ్యాక్సిన్ ఇచ్చేందుకు అనుమతి ఇచ్చింది.. ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చినట్టు…
ఇప్పుడు భారత్‌లో బయటపడిన కరోనా కొత్త వేరియంట్లు ప్రపంచదేశాలను వణికిస్తోన్నాయి.. భారత్‌లో గుర్తించిన బి.1.617, బి.1.618 వేరియంట్లు.. చాలా దేశాలకు పాకింది.. సమస్యగా కూడా మారిపోయింది. అయితే భారత్ వేరియంట్లపై ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్లు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని యూఎస్‌కు చెందిన ఎన్‌వైయూ గ్రాస్‌మాన్ స్కూల్ ఆఫ్ మెడిసన్, లాంగోన్ సెంటర్ పరిశోధకులు సంయుక్తంగా నిర్వహించిన పరీక్షలో గుర్తించారు.. ఆ రెండు వ్యాక్సిన్లు తీసుకున్న వ్యక్తుల నమూనాలను సేకరించిన పరిశోధకులు.. భారత్‌లో వెలుగు చూసిన కొత్త వేరియంట్లతో కలిపి…
కరోనా కట్టడికి భారత్‌లో వ్యాక్సినేషన్ వీలైనంత వేగంగా కొనసాగించాలని సర్కార్ భావిస్తున్నా… టీకాల కొరత మాత్రం వెంటాడుతూనే ఉంది.. ఈ నెల 1వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబడినవారందరికీ వ్యాక్సినేషన్ ప్రారంభం కావాల్సి ఉన్నా.. ఇప్పటికీ పూర్తిస్థాయిలో ప్రారంభంకాని పరిస్థితి. అయితే.. ఇప్పటికే అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు.. కోవిషీల్డ్, కోవాగ్జిన్‌తో పాటు.. రష్యా టీకా కూడా భారత్‌కు చేరుకోగా.. ఇప్పుడు భారత్‌కు వ్యాక్సిన్ల పంపిణీపై కీలక ప్రకటన చేసింది అమెరికాకు చెందిన ఫార్మా దిగ్గజం ఫైజర్..…