శ్రీలంక ఆర్థిక కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఓ వైపు ఆహార కొరత, నిత్యావసరాల ధరలు పెరుగుతూ పోతుంటే.. మరో వైపు ఇంధన కష్టాలు శ్రీలంకను పట్టిపీడిస్తున్నాయి. దేశంలో చమురు నిల్వలు అడుగంటిపోయాయి. పెట్రోల్, డిజిల్ కోసం జనాలు పెట్రోల్ బంకుల ముందు బారులు తీరుతున్నారు. పెట్రోల్ కోసం ప్రజల మధ్య ఘర్షణ తలెత్తుతోంది. బ్రిటిష్ నుంచి స్వాతంత్య్రం పొందిన 1948 తరువాత శ్రీలంకలో ఎప్పుడూ చూడని విధంగా ఆర్థిక సంక్షోభం నెలకొంది. ఇదిలా ఉంటే శ్రీలంకలో మరోసారి…