రాష్ట్రంలోని కార్పోరేషన్లు, మున్సిపాలిటీల్లో అక్రమ నిర్మాణాలపై కొరడా ఝుళిపించేందుకు పురపాలక శాఖ సిద్ధమైంది. గ్రామపంచాయతీల అనుమతితో అక్రమాలకు పాల్పడిన వారిని గుర్తించేందుకు టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసింది. జీహెచ్ఎంసీ మొదలు అన్ని మున్సిపాలిటీల్లో ఆకస్మిక తనిఖీలు చేసి కూల్చివేతలకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు అధికారులు. ఈ విషయంలో పక్కాగా ముందుకెళ్ళాలని అధికారులు భావిస్తున్నారు. గ్రామ పంచాయతీ అనుమతుల పేరిట హైదరాబాద్ శివార్లలో నిర్మించిన అక్రమ కట్టడాలపై మున్సిపల్ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. గ్రామ పంచాయతీ అనుమతి పేరుతో…