అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గ కూటమి పార్టీలు మధ్య కొత్త కుంపటి రాజుకుంది. ఇప్పటి వరకు జనసేన ఎమ్మెల్యే పంచకర్ల... టీడీపీ ఇంచార్జ్ గండిబాబ్జీ మధ్య వర్గ విబేధాలు నడుస్తుండగా.. ఇప్పుడు మేయర్ పీలా శ్రీనివాస్ ఆ జాబితాలో చేరారు. మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ విధానాలను వ్యతిరేకిస్తూ కేడర్ మీటింగ్ లో ఫైర్ అయ్యారు మేయర్ పీలా. ఇంచార్జిగా గండిబాబ్జీ ఏకపక్ష ధోరణి అవలంభిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు మేయర్.
ఆయనో ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యే. రాజకీయాలకు పాతే అయినా వయసు, సీనియారిటీ తక్కువ. దీంతో సీనియర్ నేతలే అక్కడ చక్రం చక్రం తిప్పుతూ.. ఎమ్మెల్యేకు చుక్కలు చూపిస్తున్నారట. ఇంకేముందీ హైకమాండ్ నుంచి ఎమ్మెల్యేకు ఒక్కటే అక్షింతలు. ఈ పంచాయితీనే ఆ నియోజకవర్గంలో వైసీపీ రాజకీయాలను వేడెక్కిస్తోంది. పెందుర్తిలో ల్యాండ్ రాజకీయాలు ఎక్కువ..! గ్రేటర్ విశాఖ పరిధిలో అత్యధిక ల్యాండ్ బ్యాంక్ ఉన్న నియోజకవర్గం పెందుర్తి. ఇక్కడ ప్రభుత్వ, పోరంబోకు భూములు ఎక్కువ. సబ్బవరం ఎడ్యుకేషనల్ హబ్‌గా.. పరవాడ…