CM Jagan: ఎన్టీవీకి చెందిన సీనియర్ జర్నలిస్ట్ రెహానా రచించిన సమకాలీన రాజకీయ పరిశీలనా వ్యాసాల సంకలనం పెన్ డ్రైవ్ పుస్తకాన్ని తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ ఆవిష్కరించారు. వివిధ పత్రికల్లో, ఆయా సందర్భాలలో రాసిన వ్యాసాలను సీనియర్ జర్నలిస్ట్ రెహానా పెన్‌డ్రైవ్ పేరుతో పుస్తక రూపంలో తీసుకొచ్చారు. దీంతో ఆమెను సీఎం జగన్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు (కమ్యూనికేషన్స్) జీవీడీ కృష్ణమోహన్,…