రాబోయే ఎన్నికల్లో మరిన్ని సీట్లు సాధిస్తామన్నారు మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి. టీడీపీ 40వ ఆవిర్భావ దినోత్సవాల సందర్భంగా చంద్రబాబునాయుడు చేసిన కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చంద్రబాబు తెలంగాణలో కూర్చుని ఏపీలో పాలన పై బురద జల్లుతున్నారు. విమర్శించే ముందు ఏపీ ప్రజల మనోభావాలు తెలుసుకుంటే మంచిదన్నారు. 2019లో 151 మంది ఎమ్మేల్యేలు, 23 మంది ఎంపీలను ప్రజలు గెలిపించారు. ఈసారి ఎన్నికల్లో మరింత గొప్ప విజయం అందించేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారు.…