గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘పెద్ది’. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో, గ్రామీణ క్రీడల నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని.. వెంకట సతీష్ కిలారు నిర్మించగా, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా సమర్పిస్తున్నాయి. కాగా ఈ మూవీలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, జగపతి బాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రలో కనిపించనున్నారు. విజువల్ పరంగా సినిమాకి ప్రత్యేకంగా నిలిచేలా ఆర్. రత్నవేలు సినిమాటోగ్రఫీ…