దీపావళికి విడుదలైన సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘పెద్దన్న’ చిత్రం ఇప్పటికీ భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధిస్తోంది. తమిళనాడులో భారీ వర్షాలు ఉన్నప్పటికీ ‘పెద్దన్న’జోరు ఏమాత్రం తగ్గడం లేదు. గురువారం భారీ వర్షం నేపథ్యంలో చెన్నైలోని పలు చోట్ల థియేటర్లు హౌజ్ ఫుల్ కావడం విశేషం. సిరుత్తై శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 225 కోట్లు దాటింది. ఈ వారం చివరికల్లా ఈ సినిమా 250 కోట్ల రూపాయల…