Banjara Hills Peddamma Temple Demolition: బంజారాహిల్స్ పెద్దమ్మ గుడి కూల్చివేతపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రోడ్ నెం. 12 పెద్దమ్మ గుడి కూల్చివేతపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా పెద్దమ్మ తల్లి విగ్రహాన్ని జాగ్రత్తగా భద్రపర్చాలని అధికారులకు హైకోర్టు ఆదేశించింది. పెద్దమ్మ తల్లి విగ్రహం కూల్చివేతపై పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.