వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని గోదాముల్లో రేషన్ బియ్యం మిస్సింగ్ కేసుపై మంత్రి కొల్లు రవీంద్ర సీరియస్ అయ్యారు. ఈ కేసులో పేర్ని నానికి సహకరిస్తున్నారని ఆరోపణలు ఉన్న అధికారులకు ఆయన వార్నింగ్ ఇచ్చారు. విచారణలో భాగంగా అధికారుల పాత్ర ఉంటే చర్యలు తీసుకుంటామన్నారు. రేషన్ బియ్యం కుంభకోణంపై సిట్ ఏర్పాటుకు సిఫార్సు చేస్తానన్నారు. తప్పు చేసి డబ్బులు కడితే పేర్ని నాని దొర అవుతాడా? అని మంత్రి ప్రశ్నించారు. పదేపదే నీతి వ్యాఖ్యలు…
వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబ సభ్యులపై లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయి. రేషన్ బియ్యం గోదాముల్లో తగ్గటంపై కేసు నమోదు నేపథ్యంలో అధికారులు లుక్ అవుట్ నోటీస్ జారీ చేశారు. వారం రోజులుగా పేర్ని నాని కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. అందుకే వారిపై పోలీసులు లుక్ అవుట్ నోటీసు జారీ చేశారు. పేర్ని నాని సోమవారం సాయంత్రం అజ్ఞాతం నుంచి బయటకొచ్చారు. పేర్ని నాని సతీమణి జయసుధ ఇంకా అజ్ఞాతం వీడలేదు.…