హుజురాబాద్ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ ఇంకా విడుదల కాలేదు.. కానీ, అప్పుడే ఉప ఎన్నికల వాతావరణం వచ్చేసింది.. ఓవైపు.. టీఆర్ఎస్, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. మళ్లీ విజయం సాధిస్తానన్న ధీమాతో మాజీ మంత్రి ఈటల రాజేందర్ రంగంలోకి దిగగా.. అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు నియోజకవర్గంలో మకాం వేసి పావులు కదుపుతున్నారు.. ఇదే సమయంలో.. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీచేసి ఓటమిపాలైన కౌశిక్‌రెడ్డి ఆడియో సంచలనం సృష్టించింది.. ఆ వెంటనే షోకాజ్ నోటీసులు, రాజీనామా,…
కాంగ్రెస్ పార్టీలోని ఇంటి దొంగలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. హుజురాబాద్ నియోజకవర్గానికి చెందిన కౌశిక్‌రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రకటించిన ఆయన.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలోని ఇంటి దొంగలను విడిచిపెట్టే ప్రసక్తేలేదన్నారు.. నెలాఖరు వరకు కాంగ్రెస్ ఇంటి దొంగలకు డెడ్‌లైన్ ఇస్తున్నా.. ఇంటి దొంగలను వదిలిపెట్టేదిలేదన్న ఆయన.. అదే సమయంలో.. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడేవాడు ఉంటే వదులుకునేది లేదన్నారు.. పార్టీకోసం కష్టపడేవాళ్లను గుండెల్లో చేర్చుకుని,…
తెలంగాణ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి.. 2022 ఆగస్టు 15 తర్వాత కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దుచేస్తారన్నారు రేవంత్ రెడ్డి. కేటీఆర్‌లా తనకు గాలివాటంలా ఉద్యోగం రాలేదని మీడియాతో చిట్‌చాట్‌లో అన్నారు. పొత్తులో కేటీఆర్ కి టికెట్ ఇచ్చినప్పుడు ఎంతకి కొన్నారని ప్రశ్నించారు. కేటీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టిందే టీడీపీ అన్నారు. అలాగే ఎమ్మెల్యే కాకుండానే కాంగ్రెస్ ప్రభుత్వంలో హరీష్‌రావు మంత్రి అయ్యారన్నారాయన. హరీష్‌రావు బతుకే కాంగ్రెస్ అని.. టీడీపీని విమర్శిస్తూనే…
తెలంగాణ పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి.. ఫస్ట్ రోజే ఆయన అభిమానులకు వార్నింగ్ ఇచ్చారు.. గాంధీ భవన్ వేదికగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతోన్న సమయంలో.. సీఎం రేవంత్ అని నినాదాలు చేశారు ఆయన అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు.. ఆ నినాదాలపై సీరియస్ అయ్యారు రేవంత్.. ఎవరైనా ఇప్పటి నుండి సీఎం అంటే పార్టీలో ఉండరు.. పార్టీ నుండి బయటకు పంపుతాం.. వ్యక్తిగత నినాదాలు పార్టీకి నష్టం అని స్పష్టం చేశారు.. నన్ను అభిమానించే…